బాలీవుడ్ లో ముగ్గురు ఆలియాలు!!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 03:45 PM

బాలీవుడ్ లో ముగ్గురు ఆలియాలు!!

బాలీవుడ్ భామలు దేంట్లోనైనా వెనకబడతారేమోగానీ పోల్చుకోవటంలో అస్సలు తగ్గరు! ఫ్యాషన్స్ మొదలు బాయ్ ఫ్రెండ్స్‌తో ఎఫైర్ల దాకా అన్ని విషయాల్లోనూ తోటి కథానాయికల్ని ఓ కంట గమనిస్తూనే ఉంటారు. ఇక లెటేస్ట్ గా పేర్ల సంగతి కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు బీ-టౌన్ లేడీస్!

తెలుగులో నటించి వెళ్లి, రైట్ నౌ హిందీలో బిజీగా ఉన్న బేబీ... ఆలియా అద్వానీ! అదేంటి, ఈమె పేరు కియారా అద్వానీ కదా అంటారా!? ఆమె ఇండస్ట్రీలోకి రాక ముందు ఆలియానే! బై బర్త్ పేరెంట్స్ పెట్టింది అదే పేరు. కానీ, ఆలియా బాలీవుడ్ లోకి వద్దామనుకునే సరికి... ఆలియా భట్ ఎదురుపడింది. తను అప్పటికే జనాల్లో పాపులర్ అయింది. అందుకే, ఆలియా అద్వానీ తాను మరో ఆలియా అవ్వొద్దని డిసైడ్ అయింది!.

ఆలియా భట్ ఆల్రెడీ ఉండటంతో ఆలియా అద్వానీ తన పేరుని కియారా అద్వానీగా మార్చుకుంది. అయితే, ఈ ట్రెండ్ ను ఇప్పుడు మరో ఆలియా కొనసాగిస్తోంది! త్వరలో విడుదల కానున్న 'జవానీ జానేమన్' సినిమాలో 'అలాయా' కనువిందు చేయనుంది. ఈ అలాయా ఒకప్పటి బాలీవుడ్ నటి పూజా బేడీ కూతురు. తొలి చిత్రంతో అదృష్టం పరీక్షించుకోబోతోన్న ఈమె కూడా, నిజానికి ఆలియానే! కానీ, అలాయాగా మారిపోయింది. కియారా లాగే ఆలియా భట్ ను చూసి ఈ ఆలియా కూడా నేమ్ ఛేంజ్ చేసుకుంది! మొత్తానికి, మనమైతే ప్రస్తుతం బాలీవుడ్ లో ముగ్గురు ఆలియాలు ఉన్నారనే భావించాలి. ఆలియా, కియారా, అలాయా... ఈ ముగ్గురిలో ఏ ఆలియా అంతిమంగా ఆలిండియా సూపర్ స్టార్ గా చరిత్రలో నిలుస్తుందో మరి!





Untitled Document
Advertisements