చిన్న వయసు..పెద్ద మనసు...స్నేహితుని ఆపరేషన్ కోసం తపన!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 03:46 PM

చిన్న వయసు..పెద్ద మనసు...స్నేహితుని ఆపరేషన్ కోసం తపన!

ఆ పిల్లల వయసు మూడు నుంచి నాలుగేళ్లే. అందరూ ప్రీస్కూల్​ స్టూడెంట్స్. ఇంకా లోక జ్ఞానం కూడా తెలియదు. అయితేనేం ఆపదలో ఉన్న తమ క్లాస్​మేట్​ కోసం అందరూ ముందుకొచ్చారు. ఎంతో పరిణతితో ఆలోచించి ఫండ్​ రైజింగ్​కు శ్రీకారం చుట్టారు. పది వేల డాలర్లు సేకరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కాలిఫోర్నియాలోని రెడ్డింగ్​ కో ఆపరేషన్ ​ప్రీస్కూల్​లో జస్పేర్​ మజ్జోక్కో (4) అనే బాలుడు చదువుకుంటున్నాడు. దురదృష్టవశాత్తు జస్పేర్​కు బ్రెయిన్ ​కేన్సర్ ​ఉందని పోయినేడాది తెలిసింది. దీంతో జస్పేర్​ను ఆస్పత్రిలో చేర్పించారు. సర్జరీకి 50 వేల డాలర్లు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పారు. ఎలాగైనా జస్పేర్ ​ఫ్యామిలీకి సహాయం చేయాలని పిల్లలు నిర్ణయించుకున్నారు. ‘‘లెమనోడ్​ స్టాల్ పెడదామని మా అమ్మాయి ఐడియా ఇచ్చింది. అయితే ఇది చలికాలం కదా! అందుకే హాట్​ కోకో స్టాండ్​పెడదామని నిర్ణయించాం” అని ప్రీస్కూల్​లో చదువుకునే​ ఓ చిన్నారి తల్లి, ఫండ్ ​రైజర్ బెక్కీ హస్కిన్​ తెలిపారు. స్థానికుల సహాయంతో జనవరి 10న ‘‘కోకో ఫర్​ఏ క్యూర్” పేరుతో హాట్ కోకో స్టాండ్ ​ఏర్పాటు చేసి 10వేల డాలర్లు సేకరించారు. దీనికి పాపులర్​ కాఫీ హౌస్​ స్టార్​బక్స్, వేర్​హౌస్ ​క్లబ్​ కొస్కో​ కూడా సహాయం చేశాయి. మరోవైపు జస్పేర్​ తల్లిదండ్రులు ‘గో ఫండ్ ​మీ’’ పేజ్ ​ద్వారా 32వేల డాలర్లు సేకరించారు.







Untitled Document
Advertisements