కుప్పకూలిన మార్కెట్...సెన్సెక్స్ 400 పాయింట్లు పతనం

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 07:58 PM

కుప్పకూలిన మార్కెట్...సెన్సెక్స్ 400 పాయింట్లు పతనం

సోమవారం దేశీ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిల్లో ప్రారంభమైన మార్కెట్ చివరకు అదే జోరు కొనసాగించలేకపోయింది. చతికిలపడింది. భారీగా నష్టపోయింది. హెవీవెయిట్ షేర్లలో అమ్మకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం, గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ వంటి మార్కెట్‌ను దెబ్బతీశాయి. ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 42,274 పాయింట్ల నుంచి ఏకంగా 770 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 12,430 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 214 పాయింట్లు పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 416 పాయింట్ల నష్టంతో 41,529 వద్ద, నిఫ్టీ 128 పాయింట్ల నష్టంతో 12,224 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ 50లో పవర్ గ్రిడ్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, భారతీ ఎయిర్‌టెల్, గెయిల్, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్ దాదాపు 3 శాతం లాభపడింది. అదేసమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఐఓసీ, రిలయన్స్, కోల్ ఇండియా షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ ఏకంగా 3 శాతానికి పైగా పడిపోయింది.






Untitled Document
Advertisements