టూవీలర్‌ ఉంటే కచ్చితంగా తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్ పాలసీలు!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 11:18 AM

భారత్‌లో టూవీలర్లకు ఉన్న డిమాండ్ వేరే. ఆటోమొబైల్ పరిశ్రమలో టూవీలర్లదే హవా. దేశీ వాహన అమ్మకాల్లో దాదాపు 80 శాతం టూవీలర్లే ఆక్రమిస్తున్నాయి. బైక్స్, స్కూటర్లు కొనేవారు ఎక్కువ అవుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే టూవీలర్ ఉన్న వారు కచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవాలి. కేవలం ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సరిపోదు. పాలసీకి అదనంగా యాడ్ ఆన్ కవర్స్ కూడా ఉంటే మంచిది. రోడ్డ ప్రమాదం జరిగినప్పుడు మీరు టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే.. కుటుంబ సభ్యులకు పాలసీ మొత్తం లభిస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు జీరో డిప్రిసియేషన్, ఇంజిన్ ప్రొటెక్టర్ కవరేజ్ ఉందా? లేదా? అని చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే యాడ్ ఆన్ కవరేజ్ తీసుకోండి. దీని వల్ల టూవీలర్‌కు ఏమైనా డ్యామేజ్ జరిగితే కవరేజ్ లభిస్తుంది. ఇంజిన్‌లో ఏమైనా పార్ట్స్ దెబ్బతింటే.. వాటికి రిప్లేస్‌మెంట్ పొందొచ్చు. అలాగే లేబర్ చార్జీలు కూడా వీటిల్లో కవర్ అవుతాయి. కన్సూమబుల్ కవరేజ్ కూడా ఒకటి ఉంది. ఇది యాడ్ ఆన్ కవరేజ్. పాలసీకి అదనంగా తీసుకోవాలి. దీని వల్ల ఇంజిన్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, పవర్ స్టీరింగ్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, బ్యాటరీ ఎలక్ట్రోలైట్, రేడియేటర్ కూలంట్, స్క్రూ వంటి వాటికి కవరేజ్ లభిస్తుంది. పిలియన్ కవర్ అనేది మరోకటి ఉంటుంది. బైక్ ఓనర్ మాత్రమే కాకుండా టూవీలర్‌పై ప్రయాణించే మరొకరికి కూడా పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తించేలా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. కనీసం రూ.15 లక్షలకు అదనపు యాక్సిడెంట్ కవరేజ్ తీసుకుంటే మంచిది.








Untitled Document
Advertisements