అండర్‌ -19 వరల్డ్‌‌కప్‌‌లో రికార్డు.....గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 11:39 AM

అండర్‌ -19 వరల్డ్‌‌కప్‌‌లో రికార్డు.....గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్!

ప్రపంచ క్రికెట్‌‌లో శ్రీలంక బౌలర్‌ మతీషా పతిరానా సంచలనం సృష్టించాడు. అండర్‌ -19 వరల్డ్‌‌కప్‌‌లో భాగంగా.. ఆదివారం ఇండియాతో జరిగిన మ్యాచ్‌‌లో పతిరానా గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బాల్‌ వేశాడు. అన్ని స్థాయిల్లో, అన్ని ఫార్మాట్‌ క్రికెట్‌‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్పీడ్‌ . దీంతో 2003లో ఇంగ్లండ్‌‌పై పాక్‌ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ 161.3 కిలోమీటర్ల స్పీడ్‌తో వేసిన ఫాస్టెస్ట్‌‌ డెలివరీ తుడిచిపెట్టుకుపోయింది. బౌలింగ్‌‌ యాక్షన్‌‌లో మలింగను తలపించే పతిరానా వేసిన ఆ బాల్‌ వైడ్‌‌గా వెళ్లినా .. స్పీడ్‌ గన్‌‌లో మాత్రం 175 కేపీహెచ్‌‌గా రికార్డు అయ్యింది. అయితే ఇటీవల స్పీడ్‌ గన్‌‌ లెక్కలపై విమర్శలు వస్తున్నా.. పతిరానా ఫాస్టెస్ట్‌‌ బాల్‌ పై ఐసీసీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. 2010లో ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా పేసర్‌ షాన్‌‌ టెయిట్‌ 161.1 కేపీహెచ్‌ మార్కును అందుకోగా, 2005లో న్యూజిలాండ్‌‌పై బ్రెట్‌ లీ కూడా 161.1 కేపీహెచ్‌ వేగంతో బాల్‌ వేశాడు.





Untitled Document
Advertisements