పీపీఎఫ్ స్కీమ్‌: నెలకు కేవలం రూ.5,000తో రూ.కోటి లాభం!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 12:15 PM

పీపీఎఫ్ స్కీమ్‌: నెలకు కేవలం రూ.5,000తో రూ.కోటి లాభం!

డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి అదిరిపోయే రాబడి పొందాలని భావిస్తున్నారా? అయితే మీకో ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఏకంగా కోటీశ్వరులు కావొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితనమైన రాబడి ఉంటుంది.ఈ స్కీమ్ పేరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ అకౌంట్‌పై 7.9 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. మోదీ సర్కార్ మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. అంటే వడ్డీ రేటు పెంచొచ్చు. లేదా తగ్గించొచ్చు. ఇదీకాకపోతే అలాగే స్థిరంగా కొనసాగించొచ్చు. వడ్డీ రేటు సంవత్సరానికి ఒకసారి మీ అకౌంట్‌కు జమవుతూ వస్తుంది.మీరు పీపీఎఫ్ ఖాతాను 25 ఏళ్లలో ప్రారంభిస్తే.. ప్రస్తుత వడ్డీ రేటు 7.9 శాతం ప్రకారం.. 35 ఏళ్లలో మీరు ఏకంగా రూ.కోటికి పైగా పొందొచ్చు. దీని కోసం మీరు ప్రతి నెలా రూ.5,000 డిపాజిట్ చేస్తూ రావాలి. పీపీఎఫ్ అకౌంట్‌లో ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది. అంటే మీరు ఈ మొత్తాన్ని పీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తే 35 ఏళ్ల తర్వాత (రిటైర్మెంట్ తర్వాత) ఏకంగా రూ.2.7 కోట్లు పొందొచ్చు.అదే మీరు ఒకవేళ 30 ఏళ్ల వయసులో పీపీఎఫ్ ఖాతాను ప్రారంభిస్తే.. అప్పుడు మీరు 30 ఏళ్ల తర్వాత రూ.కోటి పొందాలంటే అప్పుడు నెలకు రూ.7,189 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఏడాదికి రూ.1.5 లక్షలు పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేస్తే.. అప్పుడు మీకు 30 ఏళ్ల తర్వాత చేతికి రూ.1.8 కోట్లు వస్తాయి.పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ సాధారణంగా 15 ఏళ్లు ఉంటుంది. మీరు ప్రతి ఏడాది రూ.1.5 లక్షల్ ఇన్వెస్ట్ చేస్తూ వస్తే.. అప్పుడు మీకు 15 ఏళ్ల తర్వాత చేతికి రూ.43 లక్షలు వస్తాయి. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల కాల పరిమితితో పొడిగించుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉంటాయి. ఇన్వెస్ట్ చేసిన డబ్బు, వచ్చే వడ్డీ, విత్‌డ్రా చేసుకునే డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు.








Untitled Document
Advertisements