పాల ప్యాకెట్లు దొంగతనం చేసిన పోలీసులు!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 12:48 PM

పాల ప్యాకెట్లు దొంగతనం చేసిన పోలీసులు!

నోయిడాలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది. అందులో .. నోయిడాకు చెందిన ఇద్దరు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒక షాపు ముందు పాల ట్రేలు ఉన్నాయి. అక్కడికి వెళ్లిన ఒక పోలీసు అధికారి కాసేపు అక్కడ అటూ ఇటూ నడుస్తు కనిపించాడు. కాసేపు అలా నడిచిన తర్వాత.. పాల ట్రేల నుంచి రెండు పాల ప్యాకెట్లు తీసి.. పక్కనే ఉన్న పెట్రోలింగ్ వాహానంలోని తన తోటి ఉద్యోగికి అందించాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయింది. ఆ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతుంది. తప్పులను అరికట్టాల్సిన పోలీసులే ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడితే ఎలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.





Untitled Document
Advertisements