భారత్‌లో తొలి అండర్‌ వాటర్‌ మెట్రో...త్వరలో ప్రారంభం

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 01:13 PM

భారత్‌లో తొలి అండర్‌ వాటర్‌ మెట్రో...త్వరలో ప్రారంభం

కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్‌ త్వరలో దేశంలోనే మొదటి అండర్‌వాటర్‌ మెట్రో ఈస్ట్‌-వెస్ట్‌ ప్రాజెక్టును ప్రారంభించనుంది. 1984లో చేపట్టిన ప్రాజెక్టుకు విస్తరణగా ముందుకొచ్చిన భారత్‌లో తొలి అండర్‌ వాటర్‌ మెట్రో ఎన్నో అడ్డంకులు,ఖర్చు అంచనాలను అధిగమిస్తూ మార్చి 2022 వరకు అందుబాటులోకి రానుంది. భారత రైల్వే బోర్డు నుంచి చివరి వాయిదాగా రూ 20 కోట్లు మైట్రో రైల్‌ అథారిటీకి అందనుండగా విస్తరణలో భాగంగా చేపట్టిన అండర్‌వాటర్‌ మెట్రో పనులు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు రూ 10,000 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 49 శాతం జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ నిధులు సమకూర్చింది. న్యూలైన్‌లో రోజుకు 9 లక్షల మంది అంటే నగర జనాభాలో 20 శాతం మంది ప్రయాణిస్తారు. 520 మీటర్ల అండర్‌వాటర్‌ టన్నెల్‌ను ఈ రైలు కేవలం నిమిషం సమయంలోపే దాటుతుందని అధికారులు తెలిపారు.

Untitled Document
Advertisements