ఫినిషింగ్ టచ్ కోసం పృథ్వీషా

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 04:16 PM

ఫినిషింగ్ టచ్ కోసం పృథ్వీషా

న్యూజిలాండ్ తో ఫస్ట్ టెస్ట్ లో ఓడిన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ లో గెలిచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని చూస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్ తో న్యూజిలాండ్ టూర్ ముగియనుంది. ఈ మ్యాచ్ కొరకు కొన్ని మార్పులు చేసింది భారత్. రేప‌టి నుంచి జ‌ర‌గ‌నున్న రెండ‌వ టెస్టులో పృథ్వీ షా ఆడ‌నున్నాడు. యువ బ్యాట్స్‌మెన్ షా.. ఫిట్‌ గా ఉన్నాడ‌ని కోచ్ ర‌విశాస్త్రీ తెలిపాడు. ట్రైనింగ్ సెష‌న్‌ కు దూరంగా ఉన్న పృథ్వీపై అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. అయితే అత‌ను క్రైస్ట్‌ చ‌ర్చ్ టెస్టులో ఆడుతాడ‌ని ర‌విశాస్త్రీ క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ టెస్టులో మ‌యాంక్‌ తో క‌లిసి పృథ్వీ ఓపెన‌ర్‌ గా దిగాడు. రోహిత్ లేక‌పోవ‌డం వ‌ల్ల అత‌నికి ఓపెనింగ్ ఛాన్స్ ఇచ్చారు. ఆ టెస్టులో పృథ్వీ తొలి ఇన్నింగ్స్‌ లో 16 ర‌న్స్ చేశాడు. టెక్నిక్ స‌రిగా లేని కార‌ణంగా.. అత‌ని ఆట‌తీరుపై అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. ప్ర‌తి ఒక ప్లేయ‌ర్ కూడా కండీష‌న్స్ త‌గిన‌ట్లుగా ఆడాల్సి ఉంటుంద‌ని శాస్త్రి అన్నాడు. ఫైనల్ టీమ్ కోసం అశ్విన్ లేదా జ‌డేజా ఎంపిక నిర్ణ‌యాన్ని శ‌నివార‌మే తీసుకోనున్న‌ట్లు చెప్పారు.

Untitled Document
Advertisements