అంధాదున్ రీమేక్ లో సెక్స్ సీన్స్...నితిన్ చేస్తాడా?

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 04:51 PM

అంధాదున్ రీమేక్ లో సెక్స్ సీన్స్...నితిన్ చేస్తాడా?

ఎట్టకేలకు యువ హీరో నితిన్ ‘భీష్మ’ సినిమాతో హిట్ కొట్టారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించారు. విడుదలైన వారం రోజుల్లో ఈ సినిమా 50 కోట్లు సాధించింది. ఇదే జోష్‌తో ఈసారి బాలీవుడ్ సినిమా రీమేక్‌తో ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నారు నితిన్. అదే ‘అంధాదున్’ సినిమా. మరి అంధాదున్ సినిమాలో సెక్స్ సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలియాలంటే ఓసారి హిందీ సినిమా చూడాల్సిందే. ‘అంధాదున్’ సినిమాలో టబు విలన్ పాత్రలో నటించారు. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే జంటగా నటించారు. ఈ సినిమాలో గాఢమైన సెక్స్ సన్నివేశాలు ఉంటాయి. హీరో.. హీరోయిన్ కళ్లకు గంతలు కట్టి మరీ రొమాన్స్ చేస్తాడు. ఆ సీన్లు బాలీవుడ్, హాలీవుడ్‌కి కొత్తేం కాదు. కానీ తెలుగులో అలాంటివి ఉంటే కష్టం. అసలు ఈ సన్నివేశాల్లో నటించడానికి నితిన్ ఒప్పుకుంటారా? అన్న చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది. అయితే ఈ సెక్స్ సీన్లకు సంబంధించి మరో చర్చ కూడా జరుగుతోంది. హిందీ వెర్షన్‌లో ఎలాంటి సీన్లు ఉన్నప్పటికీ.. తెలుగులో అలాంటి సినిమాలు తీయకూడదు కాబట్టి, అందులోనూ నితిన్ లాంటి హీరోను పెట్టి అలాంటి సన్నివేశాలు చేయిస్తే బాగోదు కాబట్టి టీం ఆ సీన్లను కట్ చేసి కేవలం లైట్ రొమాన్స్‌ను చూపించనున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. రాధికా ఆప్టే పాత్ర ఎవరికి దక్కుతుందో చూడాలి. ‘అంధాదున్’ సినిమాలో సీనియర్ నటి టబు విలన్‌గా కీలక పాత్రలో నటించారు. అయితే తెలుగు రీమేక్‌లో టబు పాత్రలో టబునే నటిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల టీం టబుని కలిసి రీమేక్ గురించి చెప్పారట. ఇందులో నటించడానికి టబు ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ అడిగినట్లు టాక్. స్టార్ యాంకర్ అనసూయను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి టబు క్యారెక్టర్‌ను టబునే పోషిస్తుందా లేక అనసూయకు దక్కుతుందా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ‘అంధాదున్’ సినిమా కథేంటంటే.. హీరో ఆయుష్మాన్ ఖురానా గుడ్డివాడు కాదు కానీ అంధుడిగనే నటిస్తాడు. అంధుడిననే చెప్పుకుంటూ పియానిస్ట్‌గా డబ్బులు సంపాదిస్తాడు. ఈ క్రమంలో విలన్ పాత్రలో నటించిన టబు, అతని భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకుంటుంది. ఓసారి టబు భర్త ఆయుష్మాన్‌ని ఇంటికి పిలిపించి పియానో వాయించాల్సిందిగా కోరతాడు. ఆయుష్మాన్ వెళ్తాడు. ఎటూ గుడ్డివాడు కదా అని టబు అతని ముందే భర్తను దారుణంగా చంపేస్తుంది. కానీ ఆయుష్మాన్‌పై అనుమానంతో అతనికి డ్రగ్స్ ఇస్తుంది. ఆ డ్రగ్స్ వల్ల ఆయుష్మాన్ నిజంగానే గుడ్డివాడు అయిపోతాడు. ఇలా రకరకాల ట్విస్ట్‌లతో కథ రసవత్తరంగా సాగుతుంది. మరి ఇదే కథను తెలుగులో యాజిటీస్ దించేస్తారా లేక మార్పులు ఏమైనా చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం నితిన్ ‘రంగ్‌దే’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కీర్తి సురేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క ఏప్రిల్‌లో నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన ప్రేయసి షాలినితో ఏప్రిల్ 24న నితిన్ పెళ్లి దుబాయ్‌లో ఘనంగా జరగనుంది.





Untitled Document
Advertisements