మరో బడ్జెట్ మొబైల్ ను లాంచ్ చేయనున్న శాంసంగ్

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 12:09 PM

మరో బడ్జెట్ మొబైల్ ను లాంచ్ చేయనున్న శాంసంగ్

కొన్ని వారాల క్రితం గెలాక్సీ ఎం01 స్మార్ట్ ఫోన్ ను రూపొందిస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని గీక్ బెంచ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఇది కాస్త లో-ఎండ్ క్వాల్ కాం ప్రాసెసర్ పై పనిచేయనుంది. ఇందులో 3 జీబీ ర్యామ్ ఉండనుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో అందించే లో-ఎండ్ ప్రాసెసర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ తాజా వైఫై అలయన్స్ లో కూడా కనిపించింది. వైఫై b/g/n సర్టిఫికేషన్ ను ఈ ఫోన్ అందుకుంది. ఇందులో ఆండ్రాయిడ్ 10 సాఫ్ట్ వేర్ ను అందించనున్నారు. దీని మోడల్ నంబర్ SM-M015G/DSగా ఉంది. ఈ మోడల్ నంబర్ లో ఉన్న DS ప్రకారం చూస్తే ఇందులో డ్యూయల్ సిమ్ ఉండనుంది.

ఇండియా, రష్యా, శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో లాంచ్ చేయడానికి ఈ ఫోన్ ను రూపొందిస్తున్నారు. గెలాక్సీ ఏ01 రీబ్రాండెడ్ వెర్షన్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

ఇప్పటిదాకా అందుబాటులోకి వచ్చిన వివరాల ప్రకారం ఇందులో 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుందని, మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా దీన్ని మరింత పెంచుకోవచ్చని కూడా తెలుస్తోంది. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

అయితే ఆసక్తికరంగా ఈ స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ వెబ్ సైట్ లో కూడా కనిపించింది. SM-M015G అనే మోడల్ నంబర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ఈ లిస్టింగ్ లో కనిపించింది. అంతేకాకుండా ఇందులో 3 జీబీ ర్యామ్ ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది. మదర్ బోర్డులో ఉండే ‘QC_Reference_Phone’ కోడ్ ద్వారా దీని బేస్ ఫ్రీక్వెన్సీ 2.02 గిగా హెర్ట్జ్ గా ఉండనున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ ను ఇందులో ఉపయోగించనున్నారని అనుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ01 స్మార్ట్ ఫోన్ లో కూడా ఈ ప్రాసెసర్ నే ఉపయోగించారు.


ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం ఆధారి వన్ యూఐ 2.0పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 856 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,327 పాయింట్లు సాధించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి దీనికంటే మరే సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉండే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements