‘రంగ్ దే’ మోషన్ పోస్టర్‌ విడుదల

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 07:12 PM

‘రంగ్ దే’ మోషన్ పోస్టర్‌ విడుదల

‘భీష్మ’ చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న హీరో నితిన్ జోరు మీద ఉన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ క్వీన్, జూ. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రేపు (మార్చి 30) నితిన్ బర్త్ డే కావడంతో ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ ఫస్ట్‌లుక్‌లో నితిన్, కీర్తి సురేష్‌లు ఊపిరి తగిలేటంత శ్వాసల్లో బందీలు అవుతూ చాలా రొమాంటిక్‌గా కనిపించారు. ఈ చిత్రంలో అను, అర్జున్‌లుగా కనిపించబోతున్నారు నితిన్, కీర్తి సురేష్‌లు. తొలిసారి ఈ ఇద్దరూ కలిసినటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీష్మ చిత్రం హిట్ కావడంతో నితిన్‌-నాగవంశీ కాంబినేషన్ రిపీట్ చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.






Untitled Document
Advertisements