సల్మాన్‌ ఖాన్‌ ఇంట తీవ్ర విషాదం

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 11:15 AM

సల్మాన్‌ ఖాన్‌ ఇంట తీవ్ర విషాదం

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన, సోమవారం రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ధృవీకరించిన సల్మాన్, "ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము" అంటూ తన ట్విటర్‌ ఖాతాతో విషయాన్ని అభిమానులకు చేరవేశారు. అబ్దుల్లా మరణ వార్తను విని ఆయన బోరున విలపించారు. తన సోషల్ మీడియా పేజ్ ద్వారా అబ్ధుల్లా లేరన్న విషయాన్ని తెలిపారు. మరోవైపు , అబ్దుల్లా మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా బాడీ బిల్డర్‌ అయిన అబ్దుల్లా, సల్మాన్‌ తో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నిత్యమూ జిమ్ కు ఇద్దరూ కలిసే వెళ్లేవారు. గతంలో అబ్దుల్లాతో కలిసి జిమ్ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇప్పుడు అతను అకస్మాత్తుగా చనిపోవడంతో సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు. అటు బాలీవుడ్‌లో కూడా అబ్దుల్లాతో సన్నిహిత్యంగా ఉన్నవారు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Untitled Document
Advertisements