@8 లక్షలు దాటిన కరోనా కేసులు...ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్!

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 06:05 PM

@8 లక్షలు దాటిన కరోనా కేసులు...ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్!

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8 లక్షలు దాటిందని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. కాగా మరణాల సంఖ్య 38 వేలు దాటిందని పేర్కొంది. ఈ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా అమెరికాలో 1.64 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. 1.01 లక్షల కేసులతో ఇటలీ రెండో స్థానంలో ఉండగా.. 94 వేలకుపైగా కేసులతో స్పెయిన్ మూడో స్థానంలో ఉంది. ఇటలీలో 11,591 మంది కోవిడ్ కారణంగా బలయ్యారని జాన్స్ హాప్‌కిన్స్ తెలిపింది. స్పెయిన్‌లో 8,189 మంది చనిపోయారని పేర్కొంది.

చైనాలోని హుబేయ్ ప్రావిన్స్‌లో 3187 మంది కోవిడ్ కారణంగా చనిపోగా.. ఫ్రాన్స్‌లోనూ కరోనా మృతుల సంఖ్య 3000 దాటిందని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఇరాన్ (2898) కూడా 3 వేల మరణాలకు చేరువలో ఉందని పేర్కొంది. స్పెయిన్‌లో దాదాపు 20 వేల మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారని తెలిపింది.

మార్చి 6న లక్ష దాటిన కరోనా కేసుల సంఖ్య.. వేగంగా పెరుగుతోంది. కోవిడ్ కేసుల సంఖ్య లక్ష నుంచి రెండు లక్షలకు చేరడానికి 12 రోజుల సమయం పట్టగా... మార్చి 29 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7 లక్షలకు చేరింది. 48 గంటలకు కూడా గడవక ముందే ఇది 8 లక్షలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది.





Untitled Document
Advertisements