వాట్సాప్‌లో కరోనాపై ఫేక్ న్యూస్ వైరల్.... ఇద్దరి అరెస్టు, పరారీలో ముగ్గురు

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 01:57 PM

వాట్సాప్‌లో కరోనాపై ఫేక్ న్యూస్ వైరల్.... ఇద్దరి అరెస్టు, పరారీలో ముగ్గురు

కరోనా వైరస్ అసత్య ప్రచారాలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. తాజాగా కరోనాపై వాట్సాప్‌లో వదంతులు వ్యాపింపజేసిన తమిళనాడులోని తిరుత్తణికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం ఎల్‌సీవీ, తిరుత్తణి బైక్‌ టెక్నిషియన్‌ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా తిరుత్తణిలో కరోనా వైరస్‌ ఎక్కువగా ఉందని వందతులు వ్యాపించడంతో జిల్లా ఎస్పీ సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు తిరుత్తణి పోలీసులు విచారణ చేపట్టారు.


తిరుత్తణి- చిత్తూరు రోడ్డు ప్రాంతానికి చెందిన సులైమాన్‌ కుమారుడు అబ్ధుల్‌ రెహమాన్‌, కాశీనాథపురం గ్రామం కొల్లాపురమ్మ వీధికి చెందిన స్వామినాథన్‌, మనోజ్‌కుమార్‌, వెంకటేశన్‌, భవానీలు కరోనా వైరస్‌ గురించి ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో అబ్దుల్‌ రెహమాన్‌, స్వామినాథన్‌ను మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. కరోనా వైరస్ గురించి రూమర్స్ క్రియేట్ చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.





Untitled Document
Advertisements