లాక్ డౌన్‌: ఎడారిలో చిక్కుకున్న హీరో..ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 11:11 AM

లాక్ డౌన్‌: ఎడారిలో చిక్కుకున్న హీరో..ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా లాక్ డౌన్ అయ్యింది. అన్నిరకాల సేవలుబంద్ చేశారు. అంతర్జాతీయ విమానాల నుంచి లోకల్‌గా తిరిగే బస్సులు, క్యాబ్‌ల వరకు అన్నీ నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మలయాళ చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం జోర్డాన్ వెళ్లింది. అక్కడ ఓ ఎడారి ప్రాంతంలోకి వెళ్లి చిక్కుకుపోయింది. ఎటూ కదిలే దారి లేక, యూనిట్ మొత్తం ఆకలి బాధలు పడుతోందట. వారిని ఎలాగైనా వెనక్కు రప్పించాలని మాలీవుడ్ ప్రముఖులంతా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని, అధికారుల్ని కోరుతున్నారు.

వివరాల్లోకి వెళితే మాళయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ హీరోగా, బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆడు జీవితం' పేరిట ఓ చిత్ర నిర్మాణం మొదలైంది. కథలో భాగంగా సినిమా షూటింగ్ ను జోర్డాన్ ఎడారిలో జరపాలని భావించారు. అక్క‌డి ప‌రిస్థితులు బాగోలేవ‌ని కొందరు చెప్పినా, చిత్ర యూనిట్ వినలేదట. తీరా అక్కడికి వెళ్లిన తరువాత క‌రోనా తీవ్ర‌రూపం దాల్చింది. ఇండియా లాక్ డౌన్ అయింది. విమానాలు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో, వారంతా అక్కడే చిక్కుకుపోయారు. ఇప్పుడు తమను ఎలాగైనా ఇండియాకు తీసుకెళ్లాలంటూ వారంతా కోరుతున్నారు. పాపం ఎడారి ప్రాంతం కావడంతో తినడానికి సరిగా తిండి కూడా ఏం దొరకడం లేదంట. తమ కష్టాల్ని గుర్తించి వెంటనే తమను ఇండియాకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని వాపోతున్నారు.

కీల‌క స‌న్నివేశాల‌ను జోర్డాన్ ఎడారిలో చిత్రీక‌రించ‌డానికి అక్క‌డి ప్ర‌భుత్వం నుండి ఆదేశాల‌ను పొందారు. ఏప్రిల్ 10 వ‌ర‌కు షూటింగ్ జ‌రుపుకోవాల్సిన ఈ సినిమా .. క‌రోనా ఎక్కువగా ప్ర‌బ‌లుతుండ‌టంతో అక్కడి అధికారులు షూటింగ్‌ను ఆపేయాల్సిందిగా కోరారు. దీంతో 58 మంది స‌భ్యులున్న యూనిట్ ఇప్పుడు అక్క‌డే చిక్కుకుపోయింది. మ‌న దేశానికి విమాన రాక‌పోక‌లు కూడా లేక‌పోవ‌డంతో ఎంటైర్ యూనిట్ అక్కడే ఉండిపోయింది. ఎలాగైనా మాకు సహాయపడాలని దర్శకుడు బ్లెస్సీ కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశాడు. అన్న‌పానీయాలు సైతం అందుబాటులో ఉండ‌ట్లేద‌ని, కేర‌ళ‌కు తిరిగి వ‌ద్దామ‌న్నా విమానాల రాక‌పోక‌లు స్థంభించిపోయాయ‌ని పేర్కొన్నాడు. ప్ర‌భుత్వ సాయం లేనిదే కేర‌ళ‌కు రావ‌డం దాదాపు అసాధ్య‌మ‌ని వాపోయాడు. మా స‌మస్య‌కు ప్ర‌భుత్వ‌మే ప‌రిష్కారం చూపాల‌ని లేఖ‌లో విజ్ఞప్తి చేశాడు.





Untitled Document
Advertisements