ఎక్కువగా 21 – 40 ఏళ్ల వ‌య‌సు వాళ్లేకే క‌రోనా....

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 08:56 PM

ఎక్కువగా 21 – 40 ఏళ్ల వ‌య‌సు వాళ్లేకే క‌రోనా....

దేశంలో శ‌నివారం సాయంత్రానికి క‌రోనా కేసుల సంఖ్య‌ 2,902కి చేరిన‌ట్లు తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త‌ కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్. ఇందులో 21 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు వాళ్లే ఎక్కువ‌గా 42 శాతం పేషెంట్లు ఉన్నారని చెప్పారాయ‌న‌. దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై ఆరోగ్య శాఖ ప్రెస్ మీట్ లో ఆయ‌న ఈ వివ‌రాలు వెల్లడించారు. 0-20 ఏళ్ల మ‌ధ్య వాళ్లు 9 శాతం, 21-40 మ‌ధ్య వ‌య‌సు వాళ్లు 42 శాతం, 41-60 ఏళ్ల మ‌ధ్య వాళ్‌లు 33 శాతం, 60 ఏళ్ల పైబ‌డిన వాళ్లు 17 శాతం క‌రోనా పేషెంట్లు ఉన్నార‌ని తెలిపారు ల‌వ్ అగ‌ర్వాల్. దేశ వ్యాప్తంగా మొత్తం క‌రోనా సోకిన వారిలో 30 శాతం కేసులు ఢిల్లీ త‌బ్లిగీ జమాత్ స‌ద‌స్సుకు హాజ‌రైన వారు, వారి కాంటాక్ట్స్ ఉన్నార‌ని చెప్పారు ల‌వ్ అగ‌ర్వాల్. ఇప్ప‌టి వ‌ర‌కు 17 రాష్ట్రాల్లో 1023 మంది క‌రోనా పేషెంట్లు ఆ స‌ద‌స్సుతో లింక్ ఉన్న‌వాళ్లేన‌ని తెలిపారు.







Untitled Document
Advertisements