భారతీయులు తస్మాత్ జాగ్రత్త .. వైరల్ అవుతున్న వీడియో

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 03:48 PM

భారతీయులు తస్మాత్ జాగ్రత్త .. వైరల్ అవుతున్న వీడియో

చైనాలోని వూహన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. వూహన్ సిటీ నుంచి మెల్లగా చైనా మొత్తం వ్యాపించిన ఈ వైరస్ భారిన పడి దాదాపు 3000 మందికి పైగా మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఈ వ్యాధి బారిన 80 వేలకు పైగానే అనారోగ్యం పాలయ్యారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా అక్కడ కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అయితే వైరస్ ముప్పు ఉన్నప్పుడు ప్రకటించిన లాక్ డౌన్ ని చైనా ప్రభుత్వం ఇప్పుడు ఎత్తివేసింది. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ను ఎతివేసినట్లు ప్రకటించింది. కాని అక్కడ పరిస్థితులు మాత్రం ఇంకా లాక్ డౌన్ లానే ఉన్నాయని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. జార్ఖండ్ కు చెందిన ఓ వ్యక్తి చైనాలో స్థిరపడి అక్కడి పరిస్తుతులను ఎదుర్కొని వాటి అవగాహన కోసం ఓ వీడియో షేర్ చేసాడు. అయితే ఆ వీడియోలో అతను ఏం చెప్పాడంటే...అక్కడ లాక్ డౌన్ ఎత్తివేసాక కూడా ప్రజలు ఇంటి గడప దాటడంలేదని ప్రతీ ఒక్కరికి కరోనా భయం ఇంకా పోలేదని వివరించాడు. అక్కడ పరిస్థితి అలా ఉంటే మన భారతీయులు మాత్రం ప్రభుత్వ సూచనలను ఏ మాత్రం లెక్కచేయకుండా నిభందనలకు విరుద్దంగా రోడ్లపై విచ్చల విడిగా భయం లేకుండా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే భారత జాతీయ పార్టీ లీడర్లు సైతం ఏమాత్రం లెక్కచేయడం లేదని అసహనం వ్యక్తం చేశాడు.









Untitled Document
Advertisements