ఇంట్లో నుంచే డబ్బు సంపాదించాలంటే 5 ఆప్షన్స్‌...అవేంటంటే!

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 12:18 PM

కరోనా వైరస్ దెబ్బకి దేశం మొత్తం లాక్ డౌన్ పరిస్థితుల్లోకి జారుకుంది. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమే. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారా? ఎత్తివేస్తారా? చూడాలి. అయితే లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఇలాంటి సందర్భంలో అదనపు ఆదాయ మార్గాల వల్ల కొంత వెసులుబాటు కలగొచ్చు. ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించింకేందుకు పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతూ కూడా డబ్బు సంపాదించొచ్చు. దీన్ని ఆన్‌లైన్ ట్యుటరింగ్ అని పిలుస్తారు. ఈమధ్య కాలంలో ఇది చాలా పాపులర్ అయ్యింది. కొన్ని వెబ్‌సైట్లు ట్యూషన్ చెప్పేవారికి డబ్బులు అందిస్తున్నారు. ఇక్కడ క్లాస్, లెసన్, కంటెంట్ ప్రాతిపదికన మీకు వచ్చే మొత్తం ఆధాపడుతుంది.


2. ప్రూఫ్ రీడింగ్ ద్వారా కూడా ఆదాయం పొందొచ్చు. ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్, కంటెంట్ క్రియేటర్స్ నుంచి వీరికి మంచి డిమాండ్ ఉంది. పేజ్‌కు రూ.50 లేదా గంటకు రూ.150 అని ప్రూఫ్ రీడర్స్‌కు డబ్బులు చెల్లిస్తూ ఉంటాయి. ఇలా మీరు రోజుకు 3 గంటలు పనిచేసినా వారానికి ఐదు పని రోజుల లెక్కన రూ.2,250 వరకు సంపాదించొచ్చు.


3. ఆన్‌లైన్ సర్వేల్లో పాల్గొనడం వల్ల కూడా ఆదాయం పొందొచ్చు. వెబ్‌సైట్స్ ప్రాతిపదికన మీకు వచ్చే డబ్బులు ఆధారపడి ఉంటాయి. కొన్ని డబ్బులకు బదులు వోచర్లు అందిస్తుంటాయి. అంతేకాకుండా ఈమెయిల్స్ చదవడం వల్ల కూడా ఆదాయం పొందొచ్చు.


4. బ్లాగింగ్ ద్వారా కూడా డబ్బు సంపాదించొచ్చు. సొంతంగా బ్లాగ్‌ను ఏర్పాటు చేసుకొని, దీన్ని కంటెంట్‌తో బిల్డప్ చేసుకుంటూ వెలితే సరిపోతుంది. ఇలా మీ బ్లాగ్‌లో ఇతర కంపెనీల ప్రొడక్టులను, లింక్స్‌ను ప్రమోట్ చేసుకుంటూ డబ్బు పొందొచ్చు. మీకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నా కూడా కంపెనీలు వాటి ప్రొడక్టులను మీచేత ప్రమోట్ చేయించుకుంటాయి.

5. ఫోటోలు లేదా వీడియోలను విక్రయించడం ద్వారా కూడా రాబడి పొందొచ్చు. దీని కోసం మీకు ఫోన్ లేదా కెమెరాకు పని చెప్పాల్సి ఉంటుంది. మీ వద్ద ఉన్న ఫోటోలను ఫిక్సబే, జిట్టీ, షట్టర్‌షాక్, పిక్సెల్స్ వంటి వాటికి విక్రయించొచ్చు. స్టాక్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌కు మీ వీడియోలను విక్రయించినా కూడా మంచి ఆదాయం వస్తుంది.

Untitled Document
Advertisements