జనసేన నేత మనోహార్ కి జన్మదిన శుభాకాంక్షలు

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 04:48 PM

నేడు జనసేన పార్టీ కీలక నేత, నాదెండ్ల మనోహర్ గారి జన్మదినం… ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా నాదెండ్ల మనోహర్ కి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతేకాకుండా మనమందరం కలిసికట్టుగా దేశ భవిష్యత్తుకి, ప్రజలందరికి కూడా అండగా ఉండాలని సూచించారు. కాగా “గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారికి… జనసైనికుల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ సుదీర్ఘ రాజకీయ అనుభవం రాష్ట్ర భవిష్యత్తుకి, ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నా” అని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పోస్టు చేశారు.

కాగా జనసేనాని చేసిన వాఖ్యలపై పలువురు జనసైనికులు స్పందిస్తూ, జనసేన నేత మనోహార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, జనసేనాని కి మద్దతుగా పలు వాఖ్యలు చేశారు. కాగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న తరువాత, పార్టీ కి అండగా ఉంటారని భావించిన అందరు కూడా మధ్యలోనే పార్టీని వదిలి వెళ్లిపోయారని, కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీ కి, ప్రజలందరికి అండగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని వాఖ్యానిస్తున్నారు.





Untitled Document
Advertisements