పోకో కొత్త స్మార్ట్...బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 03:51 PM

పోకో కొత్త స్మార్ట్...బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ, వైఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందింది. కాబట్టి త్వరలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుందని అనుకోవచ్చు. ఈ రెండు లిస్టింగ్ లు కొత్త పోకో ఫోన్ లో ఏ స్పెసిఫికేషన్లు ఉన్నాయో తెలిపింది. ఈ లిస్టింగ్ లో పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ M2003J6CI మోడల్ నంబర్ తో కనిపించింది. రెడ్ మీ నోట్ 9 ప్రో కూడా M2003J6A1I మోడల్ నంబర్ తో కనిపించింది. అయితే పోకో దీనికి సంబంధించి ఎటువంటి వివరాలనూ వెల్లడించలేదు. ఇందులో బ్లూటూత్ వీ5.0 ఫీచర్ ను అందించారు. రెడ్ మీ నోట్ 9ఎస్, రెడ్ మీ నోట్ 9 ప్రో, రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ లతో పాటు ఇది లిస్ట్ అయింది. పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ బ్యాండ్ వైఫైని కూడా అందించనున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. పోకో ఎం2 ప్రో ఫ్లాగ్ షిప్ ఫోన్ కాదని, రెడ్ మీ నోట్ 9 ప్రో తరహాలోనే దీని స్పెసిఫికేషన్లు ఉండనున్నాయని తెలస్తోంది. ఇప్పటివరకు వచ్చిన లీకులను బట్టి చూస్తే రెడ్ మీ నోట్ 9 ప్రో కోడ్ నేమ్ గ్రామ్ గా ఉండవచ్చని తెలుస్తోంది. రెడ్ మీ నోట్ 9 ప్రో తరహాలోనే స్నాప్ డ్రాగన్ 7 సిరీస్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీంతోపాటు పోకో ఎం2 ప్రో షియోమీ ఇండియా ఆర్ఎఫ్ ఎక్స్‌పోజర్ పేజీలో కనిపించింది. కాబట్టి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.







Untitled Document
Advertisements