హైకోర్టులో సెలక్షన్ కమిటీ వ్యవహారంపై విచారణ!

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 01:29 PM

హైకోర్టులో సెలక్షన్ కమిటీ వ్యవహారంపై విచారణ!

ఏపీ వికేంద్రీకరణ సీఎర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం హైకోర్టుకు చేరింది. శాసనమండలి తీర్మానాన్ని అమలు చేయడం లేదంటూ హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సెలక్ట్ కమిటీ వేయకుండా మండలి కార్యదర్శి నిబంధనలు ఉల్లంఘించారని పిటిషన్‌లో ప్రస్తావించారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని.. బిల్లుల పరిశీలనకు 8మందితో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కౌన్సిల్ తీర్మానం చేసినా కమిటీ ఏర్పాటు చేయడం లేదని పిటిషన్‌లో దీపక్ రెడ్డి ప్రస్తావించారు. సెలక్ట్ కమిటీ విషయంలో మండలి కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. మండలి ఛైర్మన్ ఆదేశాలను ఉల్లంఘించారని.. అధికార పక్షానికి మండలి సెక్రటరీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. క్విడ్ ప్రోకో కింద మండలి సెక్రటరీ పదవీకాలం కూడా పొడిగించారని.. ప్రతివాదులుగా మండలి కార్యదర్శి, ప్రభుత్వం, సహాయ కార్యదర్శి పేర్లు ప్రస్తావించారు. ఇవాళ పిటిషన్‌పై విచారణ జరగనుంది.





Untitled Document
Advertisements