బడ్జెట్ ధరలో షియోమీ 5జీ ఫోన్లు!

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 07:08 PM

బడ్జెట్ ధరలో షియోమీ 5జీ ఫోన్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మరో మూడు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. అవే రెడ్ మీ 10ఎక్స్ 5జీ, రెడ్ మీ 10ఎక్స్ ప్రో 5జీ, రెడ్ మీ 10ఎక్స్ 4జీ స్మార్ట్ ఫోన్లు. వీటిలో రెడ్ మీ 10ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. రెడ్ మీ 10ఎక్స్ ప్రో 5జీలో నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. రెడ్ మీ 10ఎక్స్ 4జీ స్మార్ట్ ఫోన్ మాత్రం రెడ్ మీ నోట్ 9కు రీబ్రాండెడ్ వెర్షన్ తరహాలో ఉంది.

రెడ్ మీ 10ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ ధరను చైనాలో 1,599 యువాన్లుగా(సుమారు రూ.16,900) నిర్ణయించారు. ఇది 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,799 యువాన్లుగానూ(సుమారు రూ.19,100), 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,099 యువాన్లుగానూ(సుమారు రూ.22,200) నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,399 యువాన్లుగా(సుమారు రూ.25,400) నిర్ణయించారు.
ఇక రెడ్ మీ 10ఎక్స్ ప్రో 5జీ విషయానికి వస్తే ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,299 యువాన్లుగానూ(సుమారు రూ.24,800), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,599 యువాన్లుగానూ(సుమారు రూ.25,500) నిర్ణయించారు. ఈ రెండు ఫోన్లూ బ్లూ, వయొలెట్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. రెడ్ మీ 10ఎక్స్ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన సేల్ జూన్ 1వ తేదీ నుంచి, రెడ్ మీ 10ఎక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన సేల్ జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
రెడ్ మీ 10ఎక్స్ 4జీ మోడల్ ధరను 999 యువాన్లుగా(సుమారు రూ.10,500) నిర్ణయించారు. ఇది 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,199 యువాన్లుగా(సుమారు రూ.12,700) నిర్ణయించారు.
రెడ్ మీ 10ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లో 6.57 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. హెచ్ డీఆర్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ర్యామ్ 8 జీబీ వరకు, స్టోరేజ్ 256 జీబీ వరకు ఉంది. వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.
రెడ్ మీ 10ఎక్స్ స్మార్ట్ ఫోన్ లో 4520 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 22.5W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ మోడ్ 5జీ సపోర్ట్, బ్లూటూత్ వీ5.1, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్ బీ టైప్-సీ పోర్ట్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బరువు 205 గ్రాములుగా ఉంది.
రెడ్ మీ 10ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ లో కూడా 6.57 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేనే అందించారు. హెచ్ డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ర్యామ్ 8 జీబీ వరకు, స్టోరేజ్ 256 జీబీ వరకు ఉంది.


వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో షూటర్, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

రెడ్ మీ 10ఎక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ లో కూడా 4520 ఎంఏహెచ్ బ్యాటరీనే అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ మోడ్ 5జీ సపోర్ట్, బ్లూటూత్ వీ5.1, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్ బీ టైప్-సీ పోర్ట్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బరువు 208 గ్రాములుగా ఉంది.


రెడ్ మీ 10ఎక్స్ 4జీ స్పెసిఫికేషన్లు
రెడ్ మీ 10ఎక్స్ 4జీ స్మార్ట్ ఫోన్ లో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ర్యామ్ 6 జీబీ వరకు, స్టోరేజ్ 128 జీబీ వరకు ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

రెడ్ మీ 10ఎక్స్ స్మార్ట్ ఫోన్ లో 5020 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్ ను, 9W రివర్స్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్ బీ టైప్-సీ పోర్ట్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో వెనకభాగంలో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.





Untitled Document
Advertisements