సచివాలయం కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 12:39 PM

సచివాలయం కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు సచివాలయాన్ని కూల్చివేయొద్దని వేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సెక్రటేరియెట్ కూల్చివేతపై దాఖలైన 10 పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగగా.. కొత్త సచివాలయ నిర్మాణానికి అనుమతించింది. తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని తప్పుపట్టలేమంది. హైకోర్టు తీర్పుతో కొత్త సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది.
తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించింది.. కేబినెట్‌లో కూడా తీర్మానం చేశారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియెట్‌ను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే తెలంగాణ సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని.. పదుల సంఖ్యలో పిటిషన్లు రావడంతో విచారణ జరిపిన కోర్టు వాదనల్ని సుదీర్ఘంగా వినింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం ఇప్పుడు ఉన్న అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. అందరి వాదనలు విన్న కోర్టు కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.





Untitled Document
Advertisements