ఏపీలోని 3 జిల్లాలకు పిడుగుల బెడద...హెచ్చరికలు జారీ!

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 04:59 PM

ఏపీలోని 3 జిల్లాలకు పిడుగుల బెడద...హెచ్చరికలు జారీ!

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు- గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.

పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాలివే..
కృష్ణా జిల్లా:
గూడూరు, మొవ్వ, ఘంటశాల, మచిలీపట్నం, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, పామర్రు, తోట్లవల్లూరు.
గుంటూరు జిల్లా:
గుంటూరు, తెనాలి, కొల్లూరు, రేపల్లె, బాపట్ల, కొల్లిపర, తుళ్ళూరు, ఇపూర్, నర్సారావుపేట, చిలకలూరిపేట.
ప్రకాశం జిల్లా:
ఇంకొల్లు, మార్టూర్, యద్దనపూడి, జనకవరం పంగులూరు, అద్దంకి, ముండ్లమూరు, పర్చూరు, చినగంజాం, సింగరాయకొండ, టంగుటూరు, కొరిశపాడు.





Untitled Document
Advertisements