బీఎస్6 హోండా లీవో బైక్ లాంచ్

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 04:37 PM

బీఎస్6 హోండా లీవో బైక్ లాంచ్

లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా వాహనాల విడుదలను వాయిదా వేసుకున్న ఆటో సంస్థలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా భారత మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇటీవలే తన గ్రేజియా స్కూటర్ ను భారత విపణిలో విడుదల చేసిన హోండా సంస్థ.. తాజాగా సరికొత్త మోటార్ సైకిల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే హోండా లీవో బీఎస్6 మోడల్. బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ మోటార్ సైకిల్ ధర ఎక్స్ షోరూంలో రూ.69,442లుగా సంస్థ నిర్దేశించింది. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ కమ్యూటర్ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది.
గత మోడల్ కంటే ఎన్నో అప్డేట్లతో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ 110సీసీ ఇంజిన్ తో ఆకట్టుకుంటోంది. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా రూపకల్పన చేసిన ఈ బైక్ 110సీసీ ఇంజిన్ తో పాటు పీజీఎం-ఫై(ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం) సాంకేతికతతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈఎస్పీ(ఎనహాన్సెడ్ స్మార్ట్ పవర్) ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ అప్డేట్ల వల్ల మైలేజితో బండి పనితీరు కూడా మెరుగైంది. ఇవికాకుండా ఆకట్టుకునే ఇంధన ట్యాంకు, బాడీ గ్రాఫిక్స్, సరికొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ వైజర్ లాంటి ప్రత్యేకతల వల్ల ఈ మోటార్ సైకిల్ స్పోర్ట్స్ బైక్ లాగా అబ్బురపరుస్తుంది.
ఇవికాకుండా బీఎస్6 హోండా లీవో మోటార్ సైకిల్ ఆల్ న్యూ డిజిటల్ అనలాగ్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, ఏసీజీ స్టార్టర్ మోటార్, సరికొత్త డీసీ హెడ్ ల్యాంపులతో కూడిన పాసింగ్ స్విచ్, స్టార్ట్-స్టాప్ బటన్, ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ తో కూడిన సర్వీస్ డ్యూ ఇండికేటర్ లాంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 17 అంగుళాల పొడవైన సీటు వల్ల రైడర్ తో పాటు వెనక కూర్చున్న వారికి కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వెనక భాగంలో 5-దశల అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్ తో పాటు, ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు, స్టాండర్డ్ కాంబీ బ్రేకింగ్ సిస్టం లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.
ఈ సరికొత్త హోండా లీవో బీఎస్6 మోడల్లోని రెండు వేరియంట్లు నాలుగు కొత్త కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి రానున్నాయి. అథ్లెటిక్ బ్లూ, మ్యాటీ యాక్సిస్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, బ్లాక్ కలర్స్ లో ఈ మోటార్ సైకిల్ ను సొంతం చేసుకోవచ్చు. భారత మార్కెట్లో ఈ మోటార్ సైకిల్ కు పోటీగా హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ రేడియన్ లాంటి బైక్స్ ఉన్నాయి.





Untitled Document
Advertisements