40 శాతం కేసుల్లో బయటపడని కరోనా లక్షణాలు!!!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 01:04 PM

40 శాతం కేసుల్లో బయటపడని కరోనా లక్షణాలు!!!

ప్రపంచంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై ఏడు నెలలు పూర్తికాగా.. ఇప్పటి వరకూ సుమారు 2 కోట్ల మంది వైరస్ బారినపడగా.. వీరిలో 7.26 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నమోదవుతున్న కేసుల్లో 40 శాతం మందికి ఎటువంటి లక్షణాలు బయటపడటంలేదని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ‘అమెరికాలోని బోస్టన్ షెల్టర్ హోం‌లో 147 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 88 శాతం మందికి, టైసన్ ఫుడ్ పౌల్ట్రీ ప్లాంట్‌లో 481 మందికి వైరస్ సోకగా.. 95 శాతం మందికి, ఉత్తర కరోలినా, ఓహియో, వర్జీనియా జైళ్లలోని 3,277 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా.. 96 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు బయటపడలేదు’ అని భారత సంతతి శాస్త్రవేత్త మోనికా గాంధీ తెలిపారు.

లక్షణాల లేనివారు అనారోగ్యానికి గురైన వారితో కలిసి జీవించినా లేదా పనిచేసినా ఎటువంటి ప్రభావం చూపకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని, బాధితుల్లో వైరస్ తీవ్రతలో తేడా ఉందా? ఇది జన్యుపరమైందా? అవగాహనకు విరుద్ధంగా కొంతమందికి ఇప్పటికే వైరస్‌కు పాక్షిక నిరోధకత ఉందా? అనే తెలుసుకునే ప్రయత్నం చేశామని ఆయన అన్నారు.

‘బాధితుల్లో వైవిధ్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు చివరకు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయి.. వ్యాక్సిన్, చికిత్సల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ జ్ఞానం సహాయపడుతుందనే ఆశను పెంచుతుంది. రోగనిరోధక శక్తి విషయంలో కొత్త మార్గాలను అన్వేషించవచ్చు.. చాలా మందిలో తేలికపాటి లక్షణాలు ఉంటున్నాయి.. ఇది వైరస్ వ్యాప్తి నిరోధించి, మహమ్మారి ముగింపునకు తోడ్పడుతుందని’ అని అతన్నారు.

ఎటువంటి లక్షణాలు లేని పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదుకావడం శుభపరిణామని, ఇది వ్యక్తి, సమాజానికి మంచి విషయమని కాలిఫోర్నియా యూనివర్సిటీ అంటువ్యాధుల విభాగం నిపుణుడు మోనికా గాంధీ అన్నారు.

కరోనావైరస్ అనేక ఆధారాలను అందజేసిందని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో తీవ్ర వ్యాప్తి, పిల్లలపై తేలికపాటి ప్రభావం... స్వల్ప లక్షణాలు లేదా లక్షణాలు లేని బాధితుల నిష్పత్తి ఎక్కువగా ఉండవచ్చని, ఈ రేటు 40 శాతం ఉంటుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గత నెలలో అంచనా వేసింది.

ఆ ఆధారాలు శాస్త్రవేత్తలను వేర్వేరు దిశల్లో పరిశోధనలకు ప్రేరిపించాయి.. వయసు, జన్యుశాస్త్రం పాత్రను అర్థం చేసుకునే క్రమంలో శరీరంలో వైరస్ చొరబడటానికి ఉపయోగించే గ్రాహక కణాల పాత్రను పరిశీలిస్తున్నారు. మరికొందరు మాస్క్‌లు ధరించడం వల్ల వైరస్‌ను తగినంతగా ఫిల్టర్ చేయడంతో వారికి తేలికపాటి లక్షణాలు, అసలు లక్షణాలు ఉండటం లేదని భావిస్తున్నామని అన్నారు.

ఇటీవల అత్యంత ఉత్సాహాన్ని కలిగించిన విషయం ఏంటంటే... మన మధ్య ఉన్న కొంతమందికి ఇప్పటికే కరోనా వైరస్‌ను తట్టుకునే పాక్షిక రోగనిరోధక శక్తి వచ్చినట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.





Untitled Document
Advertisements