మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 02:04 PM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారినపడ్డారు. ఇతర పరీక్షల కోసం హాస్పిటల్‌కు వెళ్లగా వైద్య సిబ్బంది చేసిన కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా వచ్చిందని ఆయన వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ పరీక్షలు నిర్వహించుకొని తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ఈ మేరకు సోమవారం (ఆగస్టు 10) ఆయన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు.


దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు ఇప్పటికే పలువురు ప‌లువురు ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల కీలక నేతలు, సినీ సెలబ్రిటీలు ఉన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు మరికొంత మంది మంత్రలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుటుంటున్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులకు ఈ వైరస్ సోకింది. పలు రాష్ట్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు కూడా క‌రోనా సోకింది.

Untitled Document
Advertisements