రేషన్ కార్డ్ ఉన్న వారికి వారం రోజులే గడువు

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 02:08 PM

రేషన్ కార్డ్ ఉన్న వారికి వారం రోజులే గడువు

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలోనే రేషన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానానికి గడువు పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి గడువు ఇచ్చింది. దీంతో ఇప్పుడు సెప్టెంబర్ 30 దగ్గరకు వస్తోంది.

ఈ నేపథ్యంలో మీరు వెంటనే మీ రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోండి. ఇప్పటికే రెండింటిని లింక్ చేసుకొని ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇంకా రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి.

ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేవి రెండు కీలకమైన డాక్యుమెంట్లు. రేషన్ కార్డు ద్వారా సబ్సిడీ మొత్తానికే రేషన్ సరుకులు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం అర్హులైన వారికి ఈ ప్రయోజనాన్ని కల్పిస్తోంది. ఇక ఆధార్ కార్డు ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందొచ్చు.

రేషన్ కార్డు, ఆధార్ కార్డును ఆఫ్‌లైన్‌లోనే లింక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు రేషన్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడకు వెళ్లేటప్పుడు కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి. ఇంట్లో సభ్యుల అందరి ఆధార్ కార్డుల జిరాక్స్‌లు, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోట్, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్ వంటివి తీసుకెళ్లాలి. వీటి ద్వారా మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డును లింక్ చేస్తారు. ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ కాకపోతే వన్ నేషన్ వన్ రేషన్ అనే స్కీమ్ కింద బెనిఫిట్ పొందడం కుదరదు.





Untitled Document
Advertisements