రియల్‌మీ నార్జో 20 ప్రో మొదటిసేల్ ఈరోజే

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 11:42 AM

రియల్‌మీ నార్జో 20 ప్రో మొదటిసేల్ ఈరోజే

రియల్ మీ నార్జో 20 ప్రో స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మనదేశంలో ఈరోజు(సెప్టెంబర్ 25వ తేదీ) జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 65W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లను అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందువైపు పంచ్ హోల్ కెమెరా కూడా ఇందులో ఉన్నాయి.

ఇందులో రెండు వేరియంట్లలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. బ్లాక్ నింజా, వైట్ నైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ అల్ట్రా స్మూత్ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందించడం విశేషం. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై రియల్ మీ నార్జో 20 ప్రో పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను రియల్ మీ అందించింది. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగా పిక్సెల్ సెన్సార్ ను అందించారు. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరాను ఫోన్ ముందువైపు అందించారు.

ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై రియల్ మీ నార్జో 20 ప్రో పనిచేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ గా ఉంది. 65W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుండటం విశేషం. దీని మందం 0.94 సెంటీమీటర్లుగానూ, బరువు 191 గ్రాములుగానూ ఉంది.





Untitled Document
Advertisements