తెలంగాణలో మందుబాబులకు గుడ్‌న్యూస్

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 06:19 PM

తెలంగాణలో మందుబాబులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. బార్లు, క్లబ్బులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బార్లు, క్లబ్బులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. పర్మిట్ రూమ్‌లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అలాగే బార్లు, క్లబ్బుల్లో మ్యూజికల్ ఈవెంట్స్, డ్యాన్సులు నిషేధం కొనసాగుతుంది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాదాపు ఆరు నెలల బ్రేక్ తర్వాత బార్లు, క్లబ్బులు శనివారం నుంచి ఓపెన్ కానున్నాయి.



బార్లు, క్లబ్బుల్లో కస్టమర్లకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి.. జనం గుమి గూడడానికి వీల్లేదు.. పార్కింగ్ ప్రదేశాల్లో సరైన నిర్వహణ ఉండాలి. కచ్చితంగా క్యూ పద్ధతి పాటించాలి. పూర్తి పరిశుభ్ర వాతావరణం ఉండాలి. ప్రతి ఒక్కరికీ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. బార్‌లో పనిచేసే వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. అందులో పనిచేసే వారికి కూడా ఫేస్ షీల్డ్ వాడాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం బార్ పరిసరాలు శానిటైజ్ చేయాలి. ప్రతి కస్టమర్ వచ్చే ముందు, వెళ్లిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం శానిటైజ్ చేయాలి.బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లలో వెంటిలేషన్ ఉండాలి.





Untitled Document
Advertisements