ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల్లో ప్రముఖ సినీతారలు

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 01:26 PM

ప్రముఖ సినీతారలు దీపికా పడుకోన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ల ఫొటోలు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకం జాబ్ కార్డుల్లో దర్శనమిచ్చిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. సినీనటీమణుల చిత్రాలతో కూడిన 10కి పైగా నకిలీ జాబ్ కార్డులు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జిర్న్యా జిల్లా పిపార్కెడా నాకా గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉపాధి పథకం సహాయకులు సినీనటీమణుల చిత్రాలతో నకిలీ జాబ్ కార్డులతో ఖాతాల నుంచి ఉపాధి హామీ పథకం డబ్బులు స్వాహా చేశారని దర్యాప్తులో తేలింది. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులపై సినీనటీమణులు దీపికా పడుకోన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ల చిత్రాలు కనిపించడంతో ఉన్నతాధికారులు ఖంగు తిన్నారు.

Untitled Document
Advertisements