వీర మరణం పొందిన కొమరం భీం జిల్లా జవాన్

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 04:06 PM

వీర మరణం పొందిన కొమరం భీం జిల్లా జవాన్

కొమురం భీం జిల్లాకు చెందిన భారత ఆర్మీ జవాను వీర మరణం చెందాడు. లఢఖ్‌లో విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. లఢఖ్‌లో కొండచరియలు విరిగిపడి కొమరం భీం జిల్లాలోని కాగజ్ నగర్‌కు చెందిన ఆర్మీ జవాన్ మహమ్మద్ షాకీర్ (35) చనిపోయారు. మహమ్మద్ షాకీర్ మరణించిన విషయం అతని కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు శనివారం సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కాగజ్ నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Untitled Document
Advertisements