కశ్మీర్‌లో ఉగ్రవాదుల భూగర్భ రహస్య స్థావరం

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 04:17 PM

కశ్మీర్‌లో ఉగ్రవాదుల భూగర్భ రహస్య స్థావరం

జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలకు ఉగ్రవాదులు ఎలాంటి సవాళ్లు విసురుతున్నారో చెప్పడానికి తార్కాణంగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాలు కళ్లుగప్పి ముష్కరులు భూగర్భంలో రహస్యంగా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థావరాన్ని భద్రతా దళాలు గురువారం (అక్టోబర్ 15) గుర్తించాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు 55 రాష్ట్రీయ రైఫిల్స్, 185 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్‌తో కలిసి అవంతిపొరా పోలీసులు గురువారం కవాని ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన రహస్య భూగర్భ స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఉగ్రవాదుల భూగర్భ స్థావరం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, 2091 రౌండ్ల ఏకే -47 మందుగుండు, ఒక పిస్టల్, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల రహస్య భూగర్భ స్థావరానికి సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేశారు.





Untitled Document
Advertisements