రిలయన్స్ జియో మరో అదిరిపోయే ఆఫర్

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 07:52 PM

రిలయన్స్ జియో మరో అదిరిపోయే ఆఫర్

రిలయన్స్ జియో త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ అందించే ఆఫర్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన ఏదీ ఇంత వరకు రాలేదు. అయితే జియో వెబ్ సైట్ ఎఫ్ఏక్యూ పేజీలో దీనికి సంబంధించిన వివరాలు కనిపించాయి. ఈ సంవత్సరం జూన్‌లో జియో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్‌ను అందించే ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.401, రూ.612, రూ.1,208, రూ.2,599 ప్లాన్ల ద్వారా ఈ సబ్ స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అయితే జియో ప్రత్యర్థి ఎయిర్ టెల్ కూడా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్లను అందిస్తోంది. జియో ఎఫ్ఏక్యూ వెబ్ సైట్ ప్రకారం త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్లను కూడా అందించే ప్లాన్లను లాంచ్ చేయనుంది. అయితే దీని లాంచ్ తేదీకి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ విషయమై జియో కూడా ఇంతవరకు స్పందించలేదు. డిస్నీ ప్లస్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఒక నెలకు రూ.299గానూ, సంవత్సరానికి రూ.1,499గానూ ఉంది. లైవ్ స్పోర్ట్స్, మల్టీపెక్స్ మూవీస్, తాజా అమెరికన్ షోలు, సినిమాలు, డిస్నీ ప్లస్ ఒరిజినల్ కంటెంట్, హాట్ స్టార్ స్పెషల్స్‌ను ఈ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ద్వారా చూడవచ్చు. అయితే మీకు తక్కువలో కావాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అయితే ఇందులో డిస్నీ ప్లస్ ఒరిజినల్స్, అమెరికన్ షోలు, సినిమాలకు యాక్సెస్ ఉండదు. ఇవి తప్ప మిగతా కంటెంట్ మొత్తం వీఐపీ సబ్ స్క్రిప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. జియో తాజాగా రూ.499, రూ.777 ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా సంవత్సరం పాటు డిస్నీప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్లు తాజాగా లాంచ్ అయ్యాయి. రూ.401, రూ.612, రూ.1,208, రూ.2,599 ప్లాన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ టెల్ కూడా రూ.448, రూ.499, రూ.599, రూ.2,698 ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా వీఐపీ సబ్ స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది.

Untitled Document
Advertisements