4 వేల బియ్యం గింజలపై భగవద్గీత, హైదరాబాద్ మహిళ ఘనత

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 08:56 PM

4 వేల బియ్యం గింజలపై భగవద్గీత, హైదరాబాద్ మహిళ ఘనత

భగవద్గీతను పుస్తకం మీద రాయాలంటే ఎంత కష్టమో తెలిసిందే. అలాంటిది.. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ 4 వేల బియ్యం గింజలపై మొత్తం భగవద్గీతను రాసి ఔరా అనిపించారు. రామగిరి స్వారికా బియ్యం గింజలపై అత్యంత సూక్ష్యమైన అక్షరాలతో భగవద్గీతను రాశారు. ఆమె ఘనత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. ఉత్తర ఢిల్లీ కల్చరల్ అకాడమీ నుంచి ఆమె ఫస్ట్ యంగ్ ఉమెన్ మైక్రో ఆర్టిస్టుగా కూడా గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఆమె సుమారు 2 వేల మైక్రో ఆర్ట్స్ రూపొందించారు. 2016 నుంచి రామగిరి ఈ అద్భుతాలను సృష్టిస్తున్నారు.
Untitled Document
Advertisements