మరోసారి తండ్రి అయిన హీరో కార్తిక్

     Written by : smtv Desk | Wed, Oct 21, 2020, 10:51 AM

మరోసారి తండ్రి అయిన హీరో కార్తిక్

తమిళ హీరో కార్తి మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య రంజని మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని కార్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘మాకు మగబిడ్డ పుట్టాడు. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు థ్యాంక్స్ చెప్పడం ఎంత మాత్రం సరిపోదు. మా బాబుకు మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్యు గాడ్’ అని పోస్ట్ చేశారు. తమ్ముడి ట్వీట్‌కి హీరో సూర్య స్పందించారు. డాక్టర్ నిర్మలా శంకర్, ఆమె టీమ్‌కి మరోసారి థ్యాంక్స్ అంటూ కామెంట్ పెట్టారు.
కార్తి, రంజనీల వివాహం 2011లో జరిగింది. 2013లో వీరికి ఓ ఆడపిల్ల జన్మించగా... ఆమెకు ఉమయాళ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మరోసారి తండ్రి కావడంతో కార్తిని అభిమానులు అభినందలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు కార్తి కొత్త చిత్రం ‘సుల్తాన్’ షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్.

Untitled Document
Advertisements