"కేటీఆర్ ను సిఎం చేసే ఆలోచన కేసీఆర్ కు లేదు"

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 02:18 PM


తెలంగాణ సీఎం త్వరలో కేటీఆర్ అవుతారని పలు వార్తలు కొన్నిరోజులుగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. త్వరలో కేటీఆర్ సీఎం అవ్వడం ఖాయమని లీకులు ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో బీజేపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు మరో మూడేళ్లు ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు బండి. కేటీఆర్ ను సిఎం చేసే ఆలోచన కేసీఆర్ కు లేదని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ కుటుంబ, గడీల, అవినీతి ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని... జోస్యం చెప్పారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము ఉన్న ఏకైక పార్టీ బిజెపి అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బిజెపి వైపు నిలబడుతున్నారన్నారు బండి సంజయ్. దీనికి ఇటీవల జరిగిన దుబ్బాక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాల పర్వానికి కెసిఆర్ చమరగీతం పాడకపోతే బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు మంజూరు చేస్తుంటే.. కమీషన్ల పేరిట కోట్లకు కోట్లు వెనకేస్తూ.. ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేయాలని కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు తిప్పి కొడుతున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ కుటుంబం ఆరేళ్లుగా చేస్తున్న అవినీతి అక్రమాల చిట్టా త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఎన్నికల వరకే రాజకీయాలని... ఆ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలనే ప్రయత్నాన్ని మరోసారి ప్రజలు తిప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు బండి సంజయ్. దీంతో ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.





Untitled Document
Advertisements