ఆల్మండ్ చట్నీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు!

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 02:28 PM

ఆల్మండ్ చట్నీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు!

బాదంపప్పు లేదా ఆల్మండ్ దీని గురించి తెలియని వారు ఉండరు. ఇవి రోజు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నట్స్ లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. స్వీట్ గా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి, తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఇవి శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఈ నట్స్‌ని కేవలం అలానే తినడం, స్వీట్స్‌లో వేయడం వంటివి చేస్తుంటాం.. అలా కాకుండా.. ఈ సారి సరికొత్తగా బాదంతో స్పైసీ రెసిపీ చేయండి.. అదెలానో చూడండి..

శీతాకాలంలో చర్మం పొడిబారిపోకుండా చేస్తుంది.అలాగే బాదం పప్పులో ఉండే విటమిన్ ఈ యాక్నే, ముడతలు రాకుండా చేస్తుంది. అలాగే బాదం పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేయగలుగుతాయి. ఇవి ఇమ్యూనిటీని బలం గా చేసె ఈ సీజన్ లో వచ్చే జలుబు, ఫ్లూ నించి ప్రొటెక్ట్ చేస్తాయి.ఆల్మండ్స్ లో ఉండే మినరల్స్, జింక్, మెగ్నీషియం, పొటాషియం ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి, రెస్పిరేటరీ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తాయి. అంతేకాకుండా బాదం పప్పులో ఉండే హై ప్రొటీన్, హై ఫైబర్ కంటెంట్ వల్ల అరుగుదల సజావుగా జరుగుతుంది. మెటబాలిజం బూస్ట్ అవుతుంది. ఫలితం గా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది.
బాదం పప్పు కేవలం ఆరోగ్యం కోసమే కాదు, వంటలో కూడా విస్తృతంగా వాడతారు. సూప్స్ నుండీ స్మూతీస్, డిప్స్ వరకూ ఆల్మండ్స్ మంచి టేస్ట్ ని ఇస్తాయి. అందుకే ఇక్కడ మీ కోసం ఆల్మండ్ చట్నీ రెసిపీ పరిచయం చేస్తున్నాం. ఇది ఈ కాలం లో తీసుకోవడానికి బాగుంటుంది. ఈ చట్నీలో ఇంకా విటమిన్ సీ పుష్కలం గా ఉండే పుదీనా, కొత్తిమీర కూడా ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేసి సీజనల్ ఫ్లూ నించి ప్రొటెక్ట్ చేస్తాయి.

ఆల్మండ్ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు:
* బాదం పప్పు - అర కప్పు
* కొత్తిమీర - అర కప్పు
* పుదీనా - అర కప్పు
* పచ్చి మిర్చి - రెండు మూడు, లేదా రుచికి తగినన్ని
* వెల్లుల్లి - రెండు మూడు రెమ్మలు
* అల్లం - అరంగుళం ముక్క
* చింత పండు పులుసు - రెండు టేబుల్ స్పూన్లు
* బ్లాక్ సాల్ట్, పంచదార - రుచికి తగినంత
* చాట్ మసాలా - కావాలంటే
1. ఆల్మండ్స్ ని డ్రై గ్రైండ్ చేయండి.
2. ఇందులో పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి స్మూత్ పేస్ట్ లా చేయండి. అవసరాన్ని బట్టి నీరు కానీ పెరుగు కానీ కలుపుకోవచ్చు.
3. చింత పండు పులుసు కానీ, నిమ్మ రసం కానీ కలపండి. బ్లాక్ సాల్ట్, పంచదార, చాట్ మసాలా కూడా కలిపి బాగా మిక్స్ చేయండి.
స్పైసీ గా ఉండే ఆల్మండ్ చట్నీ రెడీ అయిపోయింది. పరాఠాలతో తింటే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది.





Untitled Document
Advertisements