రాత్రి ఫేస్ చేసే ఒత్తిడే పొద్దున్న బ్రేక్ ఔట్స్ కి కారణం !

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 06:17 PM

రాత్రి ఫేస్ చేసే ఒత్తిడే పొద్దున్న బ్రేక్ ఔట్స్ కి కారణం !

స్ట్రెస్ ప్రస్తుతం ఈ మాట వినని వాళ్ళు అలాగే ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురవని వాళ్ళు ఉండడం కష్టమే. మనకి తెలియకుండానే స్ట్రెస్ మనని శరీరాకంగా మానసికంగా ప్రభావితం చేస్తుంది. అయితే యాక్నే కి కల కారణాల్లో స్ట్రెస్ కూడా ఒకటని? హార్మోన్స్ వల్ల ఇలా జరుగుతోందిలే అనుకుంటాం తప్ప అంత కంటే ఎక్కువ వీటి గురించి ఆలోచించం. ముందు రోజు రాత్రి ఒక టార్గెట్ రీచ్ హడావిడిలో చాలా సేపు మేలుకుని ఉన్నారనీ, ఆ యాంగ్జైటీ వల్ల అవస్థ పడ్డారనీ అప్పుడు గుర్తుకు రాదు. రాత్రి ఫేస్ చేసే ఒత్తిడే పొద్దున్న బ్రేక్ ఔట్స్ కి కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.

ఒత్తిడి ఎక్కువైనప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఒత్తిడి పెరిగినప్పుడు ఈ కార్టిసాల్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. ఈ హార్మోన్ వల్ల ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, క్లాగ్డ్ పోర్స్ వస్తాయి, యాక్నే ని కారణమయ్యే బ్యాక్టీరియా పేరుకుంటుంది. అలాగే ఒత్తిడి వల్ల రాత్రి ఎక్కువ సేపు మేలుకుని ఉండడం డెఫినిట్ గా పింపుల్స్ కి కారణం అవుతుంది. ఒత్తిడి వల్ల రిలీజ్ అయ్యే కార్టిసాల్ ప్రొడక్షన్ ఎక్కువైన కొద్దీ స్కిన్ యొక్క సహజమైన ఇమ్యూన్ రెస్పాన్స్ లో భాగం గా సీబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. యాక్నే కి కారణమయ్యే బ్యాక్టీరియా ఈ సీబమ్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ కి కారణం అవుతుంది. ఆ ఫాలికిల్ వద్దకి వెంటనే వైట్ బ్లడ్ సెల్స్ వెళ్ళిపోయి వాటి కంటెంట్స్ రిలీజ్ చేస్తాయి, ఫలితంగా ఇంఫ్లమేటరీ పింపుల్ వస్తుంది. కొన్నిసార్లు హార్ష్ గా ఉండే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, కొన్ని రకాల ఆహార పదార్ధాలు, ప్రొటెక్టివ్ మాస్క్స్, హార్మొనల్ ట్రిగ్గర్స్ వంటి అనేక కారణాలు యాక్నే కి ఉండవచ్చు. వీటికీ స్ట్రెస్ యాక్నే కీ కల తేడా ఏమిటి? మీ బాడీ మీకేం చెప్తోందో వినడానికి ప్రయత్నించండి. మీకు జనరల్ గా బ్రేక్ ఔట్స్ రాకుండా నిద్ర లేమి తరువాత, స్ట్రెస్‌ఫుల్ ఈవెంట్ తరువాతా, బాగా ఇంటెన్స్ గా వర్క్ చేయవలసి వచ్చినప్పటి తరువాతా బ్రేక్ ఔట్స్ వస్తుంటే మాత్రం అది డెఫినెట్ గా స్ట్రెస్ యాక్నేనే. పీరియడ్ పింపుల్స్, ఇంకా కన్సిస్టెంట్ గా ఉండే బ్రేక్ ఔట్స్ - వీటికీ స్ట్రెస్ కీ ఎలాంటి రిలేషన్ లేదు.
అలాగే, స్ట్రెస్ పింపుల్స్ ఫేస్ మీద బాగా ఆయిల్ ఎక్కువగా ఉండే ప్రదేశం లోనే వస్తాయి, అంటే నుదురు, గడ్డం, ముక్కు లాంటి చోట్ల. మీ ఫేస్ లో టీ జోన్ ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. అందుకే, ఒకేసారి ఒకేచోట ఎక్కువ పింపుల్స్ ఒక గ్రూప్ లా వస్తుంటే మాత్రం అది స్ట్రెస్ యాక్నే కావచ్చు అని డాక్టర్లు అంటూ ఉంటారు. హార్మోనల్ పింపుల్స్ ఒక్కొక్కటే వస్తాయి. అయితే ఈ పింపుల్స్ తగ్గించడానికి ఒక్కటే దారి అదే ఒత్తిడి తగ్గించుకోవడానికి ట్రై చేయడం తప్పని సరి. ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి చూడండి.
1. రోజూ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం అవసరం. వాకింగ్, జాగింగ్ వంటి అవే మూమెంట్స్ మళ్ళీ రిపీట్ చేసే ఎక్సర్సైజెస్ ప్రత్యేకించి ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతారు.
2. లావెండర్, రోజ్, వెటివర్, జెరేనియం వంటి ఎస్సెన్షియల్ ఆయిల్స్ యొక్క పరిమళం స్ట్రెస్ ని తగ్గిస్తుంది. అరోమా థెరపీ ఒత్తిడినీ, యాంగ్జైటీని రెడ్యూస్ చేస్తుందని అంటారు.
3. కాఫీ తగ్గించడం అవసరం. ఎందుకంటే, కెఫీన్ ఒత్తిడిని పెంచుతుంది.
4. ఒక జర్నల్ లో రెగ్యులర్ గా మీ ఫీలింగ్స్ అన్నీ రాస్తూ ఉండండి. మీకు తెలియకుండానే మీకు స్ట్రెస్ నుండి రిలీఫ్ లభిస్తుంది.
5. మీ ఫ్యామిలీతో, మీ క్లోజ్ ఫ్రెండ్స్ తో సమయం గడపండి. ఎందుకంటే ఇది ఆక్సిటోసిన్ ని రిలీజ్ చేస్తుంది. ఆక్సిటోసిన్ ని నాచురల్ స్ట్రెస్ రిలీవర్ గా చెబుతారు.
6. హాయిగా నవ్వండి. నవ్వొచ్చే సినిమా చూడండి, పుస్తకం చదవండి, లేదా ఫన్-లవింగ్ ఫ్రెండ్స్ తో టైమ్ స్పెండ్ చేయండి.
7. మీరు చేయలేని పనులకి నిర్మొహమాటంగా నో చెప్పండి. మీరు ఏది హ్యాండిల్ చేయగలరో, ఏది హ్యాండిల్ చేయలేరో జాగ్రత్తగా అంచనా వేసుకోండి.
8. మీకు ముఖ్యమైన పనులని ఎలాంటి వాయిదా లేకుండా పూర్తి చేసుకోండి. కావాలనుకుంటే టు-డూ లిస్ట్ లాంటిది మెయింటెయిన్ చేయండి.
9. మీకు పెట్ ఉంటే ఆ పెట్ తో సమయం గడపండి, పెట్ తో ఆడుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉన్న బెస్ట్ పద్ధతుల్లో ఇది కూడా ఒకటి.
10. మంచి రిలాక్సింగ్ మ్యూజిక్ వినండి. నిశ్శబ్దంగా ప్రకృతిలో గడపడం కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది.





Untitled Document
Advertisements