RBI ALERT: మొబైల్ నెంబర్లతో మోసాలు...!

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:27 PM

RBI ALERT: మొబైల్ నెంబర్లతో మోసాలు...!

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా బ్యాంక్ కస్టమర్లను హెచ్చరించింది. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలని బ్యాంక్ ఖాతాదారులను అప్రమత్తం చేసింది. కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ బ్యాంక్ కస్టమర్లను హెచ్చరించడం గమనార్హం.

మోసగాళ్లు ఇప్పుడు మొబైల్ నెంబర్ల ద్వారా కొత్త మోసాలుకు పాల్పడుతున్నారు. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా ఆర్‌బీఐ నోటీసులను తన వెబ్‌సైట్‌లో కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి.

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ల మాదిరిగానే మోసగాళ్లు కొత్త నెంబర్లు తీసుకొని బ్యాంక్ కస్టమర్లకు కాల్ చేసి మోసం చేస్తున్నారు. ఈ నెంబర్లను సూపర్‌వైజర్డ్ ఎన్‌టిటీ కింద రిజిస్టర్ చేసుకుంటారు. ఇక్కడ బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థలు సూపర్‌వైజ్డ్ ఎన్‌టిటీ కావొచ్చు. అంటే మీకు మోసగాళ్లు ఈ కొత్త నెంబర్ల నుంచి కాల్ చేస్తే మీకు కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్స్ కూడా బ్యాంక్ పేర్లనే చూపిస్తాయి.

దీంతో యూజర్లు మోసపోయే ప్రమాదముంది. టోల్ ఫ్రీ నెంబర్ 1800 123 1234 అని అనుకుంటే.. మోసగాళ్లు 800 123 1234 నెంబర్ తీసుకొని కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్స్‌లో సూపర్‌వైజ్డ్ ఎంటిటీ టోల్ ఫ్రీ నెంబర్‌గా రిజిస్టర్ చేసుకుంటారు. దీంతో మీకు ఈ నెంబర్ కాల్ వచ్చినా కూడా బ్యాంక్ లేదా ఇతర సంస్థల నుంచి కాల్ వచ్చిందని భావిస్తారు. దీంతో మోసపోయే ప్రమాదముంది.





Untitled Document
Advertisements