చౌక ధరకే ఫ్లైట్ టికెట్...48 గంటలే ఆఫర్

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 12:37 PM

చౌక ధరకే ఫ్లైట్ టికెట్...48 గంటలే ఆఫర్

విమానంలో ప్రయాణించాలని భావిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే విమానం ప్రయాణించే ఆఫర్ ఒకటి వచ్చింది. విమాన టికెట్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. దీంతో విమానంలో ప్రయాణించే వారికి బెనిఫిట్ కలుగనుంది.
టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ విస్తారా ఎయిర్‌లైన్స్‌ తాజాగా భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ తీసుకువచ్చింది. ఈ సేవలు కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. జనవరి 9 అర్ధరాత్రి వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్యాబిన్ తరగతుల ప్రయాణానికి ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ చౌక ధరల విమాన టికెట్ల ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఫిబ్రవరి 25 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.
ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.1,299 నుంచి ప్రారంభమౌతోంది. ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.2,099 నుంచి స్టారట్ అవుతుంది. అదే బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.5,999 నుంచి ఉంటుంది. విస్తారా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వస్తుంది.





Untitled Document
Advertisements