వాట్సప్‌ లీకులపై తీవ్ర విచారణ...

     Written by : smtv Desk | Tue, Dec 12, 2017, 03:48 PM

వాట్సప్‌ లీకులపై తీవ్ర విచారణ...

ముంబాయి, డిసెంబర్ 12: 'వాట్సప్‌ లీకుల' పై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ తీవ్రంగా విచారణ జరుపుతోంది. నమోదిత కంపెనీలు తమ ఫలితాలను అధికారికంగా వెల్లడించకముందే, కొందరు వ్యక్తులు సోషల్‌మీడియా గ్రూపుల్లో ఆర్థిక ఫలితాల సమాచారన్ని బహిర్గతం చేయడంపై సెబీ సీరియస్ గా ఉంది.

తాజాగా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సదస్సు అనంతరం సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగీ మాట్లాడుతూ... "షేర్ల ధరలపై అత్యంత ప్రభావం చూపించే కంపెనీల ఆర్థిక ఫలితాల సమాచారం ముందుగానే బయటకు వెళ్తుంటే ఏం పట్టనట్టు కూర్చోలేం" అంటూ వ్యాఖ్యానించారు. ఈ లీకులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కిందకు వస్తాయో రావో పరిశీలిస్తోంది. షేర్లు ట్రేడింగ్‌ చేసిన వారి వివరాలు పరిశీలించాలని ఎక్స్ఛేంజీ వర్గాలను సెబీ ఆదేశించింది.





Untitled Document
Advertisements