లాభాలకు బ్రేక్.. నష్టాలలో సూచీలు..

     Written by : smtv Desk | Tue, Dec 12, 2017, 04:40 PM

లాభాలకు బ్రేక్.. నష్టాలలో సూచీలు..

ముంబాయి, డిసెంబర్ 12: మూడు రోజుల నుండి లాభాలతో ఉన్న స్టాక్‌ మార్కెట్లకు ఒక్కసారిగా విరామం దొరికింది. 67 పాయింట్ల నష్టంతో బలహీనంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరి వరకు అదే దశలోనే కొనసాగింది. 228 పాయింట్లు కోల్పోయి 33,228 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 82 పాయింట్లు నష్టపోయి 10,240 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.43గా కొనసాగుతోంది.

ఒకవైపు డాక్టర్‌ రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, గెయిల్‌, లుపిన్‌, ఇన్ఫోసిస్‌ మాత్రమే 3-0.5 శాతం మధ్య లాభాలను ఆర్జించాయి. మరోవైపు మిడ్ సెషన్‌ నుంచి అమ్మకాల ఒత్తిడి మరింత పెరగడంతో చివరిలో ఇంట్రాడే కనిష్టానికి చేరాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాల షేర్లు నష్టాలనే చవిచూశాయి. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో, మెటల్‌, ఫార్మా 1.6-0.7 శాతం మధ్య కిందకి పడిపోయాయి.






Untitled Document
Advertisements