శివరాత్రి ఉత్సవాలకు ముందుగానే ముస్తాబైన రాజన్న ఆలయం

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 06:35 PM

శివరాత్రి ఉత్సవాలకు ముందుగానే ముస్తాబైన
రాజన్న ఆలయం

తెలంగాణ జిల్లాల్లోనే పేదల దేవుడిగా..దక్షిణకాశీగా ఎముడాల రాజన్న ఆలయం వెలుగొందుతోంది. రాజన్న సన్నిధానంలో ఈ నెల 11 నుంచి మహాశివరాత్రి జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మూడు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. రాజన్న జాతర ఉత్సవాలను రూ. 1.50 కోట్లతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో శివార్చన అనే ప్రత్యేక సాంస్క ృతిక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. వేములవాడకు చేరుకునే ఐదు ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేందుకు భారీ స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు.





Untitled Document
Advertisements