ఒకేరోజు 30 మందికి కరోనా....స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకున్న గ్రామస్తులు

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 01:40 PM

ఒకేరోజు 30 మందికి కరోనా....స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకున్న గ్రామస్తులు

తెలంగాణ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. జిల్లా కేంద్రాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగావ్‌లో కరోనా కలకలం నెలకొంది. గ్రామంలో ఒకే రోజు 30 మందికి పాజిటివ్‌ రావడంతో ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ను కట్టడి కోసం గ్రామస్థులు మూడు రోజులపాటు స్వచ్చంధంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు.

మహాగావ్ గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు. కరోనా భయంతో గ్రామస్థులు ఇప్పటికే ఇండ్లకే పరిమితమయ్యారు. మరోవైపు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ గ్రామంలోకి ఎవరు రావొద్దని మహాగావ్‌ వాసులు సూచిస్తున్నారు. గ్రామంలో కూడా జనం ఎక్కడా గుమిగూడకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య ఇవాళ భారీగా నమోదు అయ్యాయి. రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరింది. ఇప్పటివరకు 1,734 మంది కరోనాతో మృతిచెందారు.





Untitled Document
Advertisements