కూల్డ్రింక్స్ విషయంలో జాగ్రత్తలు! మిక్సిడ్ వెజిటేబుల్ జ్యూస్ ఇలా చేయాలి

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 02:28 PM

కూల్డ్రింక్స్ విషయంలో జాగ్రత్తలు! మిక్సిడ్ వెజిటేబుల్ జ్యూస్ ఇలా చేయాలి

వేసవి వచ్చేసింది. ఎండలు బయపెడుతున్న వేళ వేసవి తాపం తీర్చుకోవడానికి ప్రతిఒక్కరు కూడా చల్లగా ఉండే కూల్డ్రింక్స్ తాగుతుంటారు. వేసవిలో ఎండ తీవ్రత వలన కలిగే తాపం తీర్చుకోవడం మంచిదే. అయితే ఆ డ్రింక్స్ కృత్రిమంగా తాయారు చేసిన డ్రింక్స్ కంటే ప్రకృతిలో సహజంగా లభించే ఫ్రూట్ జ్యూస్ అయితే వేసవి తాపం తగ్గించడంతో పాటు దేహానికి ఎంతో మేలుచేస్తాయి.
* కొబ్బరినీళ్ళు ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుత వరం. ఇంటిల్లిపాది తక్కువ ఖర్చుతో ఈ పానీయాన్ని సేవించి ఆరోగ్యలబ్ద్ది పొందవచ్చు.
* పైనాపిల్ జ్యూస్, ఆపిల్ జ్యూస్, చెరుకురసం, గ్రేప్ జ్యూస్, బత్తాయి రసం రుచినివ్వడమే కాకుండా వేసవి తాపం నుండి రక్షిస్తాయి.
* తాటి ముంజెల నీరు, టమాటో జ్యూస్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ వంటివే కాకుండా బటర్ మిల్క్, భాదం మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటివి కూడా ఒంటికేంతో ఉపకరిస్తాయి. ఈ డ్రింక్స్ బయట కొనడం కంటే ఇంట్లో స్వయంగా ప్రీపార్ చేసుకుని తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

మీకోసం కొన్ని జ్యూస్ రెసిపిస్
* క్యారెట్ జ్యూస్:- ముందుగా క్యారెట్ తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసి, మిక్సి జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని స్త్రైనర్ సహాయంతో వడకట్టాలి. వడకట్టిన క్యారెట్ జ్యూస్ లో కొద్దిగా చెక్కెర లేదా పటికబెల్లం కలుపుకుని, అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నారింజ రంగులో ఉండే క్యారెట్ ని ఆరెంజ్ జ్యూస్ రుచిలో ఉండి పిల్లలు ఇష్టంగా తాగుతారు.
* బీట్రూట్ జ్యూస్:- బీట్రూట్ తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసి, మిక్సి జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని స్త్రైనర్ సహాయంతో వడకట్టాలి. వడకట్టిన బీట్రూట్ జ్యూస్ లో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగేయాలి.
*కీరా జ్యూస్:-ముందుగా కీరా తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసి, మిక్సి జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కీరా మిశ్రమాన్ని స్త్రైనర్ సహాయంతో వడకట్టాలి. వడకట్టిన కీరా జ్యూస్ లో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగేయాలి.
మిక్సిడ్ వెజిటేబుల్ జ్యూస్:- కీరా, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి తొక్కు తీసి ముక్కలుగా కట్ చేయాలి. అందులో టమాటో ముక్కలు కూడా కలుపుకుని మిక్సి జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నమిక్సిడ్ వెజిటేబుల్ మిశ్రమాన్ని స్త్రైనర్ సహాయంతో వడకట్టాలి. వడకట్టిన ఈ జ్యూస్ లో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు కలుపుకిని తాగేయాలి.

జ్యూస్ ఏదైనా సరే ఇంట్లో చేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. అలాగే జ్యూస్ లో చెక్కర బదులు పటికబెల్లం లేదా బెల్లం వాడుకుంటే మంచిది.

Untitled Document
Advertisements