పెళ్లి పీటలెక్కనున్న రాయ్ లక్ష్మి

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 03:13 PM

పెళ్లి పీటలెక్కనున్న రాయ్ లక్ష్మి

‘దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి’ అని పెద్దలు అంటుంటారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేస్తుంది నటి రాయ్ లక్ష్మి. ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామకు ఆ తర్వాత ఊహించినంత సక్సెస్ రాలేదు. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ఐటమ్ సాంగ్‌లు మినహా.. ఆమె దక్కిన గొప్ప అవకాశాలు ఏమీ లేవు. మరోవైపు ఈ బ్యూటీకి కోలివుడ్‌లోనూ అవకాశాలు కరువయ్యాయి. దీంతో పూర్తిగా గుర్తింపు పోకముందే పెళ్లిపీటలు ఎక్కాలని నిర్ణయం తీసుకుంది రాయ్ లక్ష్మి. రాయ్ లక్ష్మి గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉందని సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘మీ పెళ్లి ఫిక్సయింది అంట కదా?’ అంటూ నెటిజన్లు ఆమెను పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నికీ చెక్ పెట్టాలని భావించింది ఆమె. తను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని ప్రకటించింది. అయితే అతనికి సంబంధించిన వివరాలను ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. అంతేకాక.. ఈ నెల 27న తన నిశ్చితార్థం జరుగనుందని తెలిపింది. ‘చాలాకాలంగా పదేపదే నన్ను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఈ విషయం ప్రకటించేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, అది పూర్తిగా నా వ్యక్తిగతం. నా జీవితభాగస్వామికి సంబంధించిన వివరాలు ఇప్పుడే బయటపెట్టను. మా ఎంగేజ్‌మెంట్ ఈ నెల 27న జరుగనుంది. ఇప్పటికే మా మిత్రులు, బంధువులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. ఇది ముందు నుంచి ప్లాన్ చేసింది కాదు.. అనుకోకుండా జరిగింది. ఈ విషయంలో మా కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. నా ‘లవ్‌’తో జీవితాన్ని పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పోస్ట్ చేసింది. కొంతకాలం క్రితం రాయ్ లక్ష్మి ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం ఆమె ‘సిండ్రిల్లా’, ‘మిరుగా’, ‘ఝాన్సీ ఐ.పీ.ఎస్’ అనే సినిమాల్లో నటిస్తోంది. మరి పెళ్లి తర్వాత అయినా.. రాయ్ లక్ష్మికి మంచి సక్సెస్ లభించాలని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు.

Untitled Document
Advertisements