శరత్ కుమార్, ఆయన భార్య రాధికలకు ఏడాది జైలు శిక్ష!!

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 03:31 PM

శరత్ కుమార్, ఆయన భార్య రాధికలకు ఏడాది జైలు శిక్ష!!

సీనియర్ నటుడు శరత్ కుమార్, ఆయన భార్య రాధికలకు ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరిచింది. లిస్టిన్ స్టీఫెన్ అనే మరో నిర్మాతతో కలిసి ఈ దంపతలు పలు సినిమాలు రూపొందించారు. ఈ క్రమంలో 2014లో ఓ సినిమా నిర్మాణం కోసం రేడియ‌న్స్ అనే సంస్థ నుంచి అప్పుగా రెండు కోట్లు తీసుకున్నారు.

ఆ తర్వాత 2017లో ఈ డబ్బు తిరిగి చెల్లించాలని రేడియన్స్ సంస్థ వీరిని కోరగా.. ఆ నగదును వాళ్లు చెక్ రూపంలో చెల్లించారు. అయితే ఆ చెక్ కాస్త బౌన్స్ అయింది. దీంతో రేడియన్స్ సంస్థ చెన్నైలోని సైదాపేట ప్రత్యేక కోర్టులో ఈ దంపతులపై కేసు దాఖలు చేసింది. 2019లో దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం శరత్ కుమార్, రాధికతో పాటు లిస్టిన్ స్టీఫెన్‌ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ కోర్టు తీర్పును సవాలు చేసు ఈ దంపతులు మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణని హై కోర్టు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేసింది. గత రెండు సంవత్సరాలుగా ఈ కేసుపై చెన్నై ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతునే ఉంది. కాగా, బుధవారం (ఏప్రిల్ 7న) దీనిపై మరో మారు విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం సాక్ష్యాధారాలను పరిశీలించి.. ఈ దంపతులకు ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements