‘వకీల్‌సాబ్’: మహిళలను చైతన్యపరుస్తున్న 'కదులు కదులు' పాట

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 07:15 PM

‘వకీల్‌సాబ్’: మహిళలను చైతన్యపరుస్తున్న 'కదులు కదులు' పాట

అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాల నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్‌సాబ్’ సినిమాతో త్వరలో వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘పింక్’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. మూడు సంవత్సరాల పవన్‌ వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలను నెలకొన్నాయి. మరోవైపు

ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి అందించిన బాణీలు ఇప్పటికే సూపర్‌హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ‘మగువా.. మగువా’ అనే పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే చిత్ర యూనిట్ తాజాగా సినిమాలోని మరో పాటని విడుదల చేసింది. ‘కదులు కదులు కదులు.. కట్లు తెంచుకొని కదులు’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోని బుధవారం విడుదల చేశారు. ఈ పాటని శ్రీకృష్ణ, హేమచంద్ర ఆలపించారు. ప్రముఖ రచయిత సుద్దాల ఆశోక్‌ తేజా ఈ పాటకి సాహిత్యం సమకూర్చారు. ఈ పాటలో ‘గాజుతో గాయాలు చెయ్.. చున్నీనే ఉరితాడు చెయ్.. రంగులు పెట్టే గోళ్లనే బాకులు చెయ్’ వంటి మాటలు మహిళలను ఎంతో చైతన్యపరుస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘కంటిపాప’, ‘సత్యమేవ జయతే’ పాటల తరహాలోనే ఈ పాట కూడా ఉత్తేజభరితంగా ఉంది.ఇక ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్యలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బోణీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.Untitled Document
Advertisements